: పాక్ నుంచి ఎగిరొచ్చిన బెలూన్లు... సరిహద్దుల్లో కలకలం


పాకిస్తాన్ నుంచి ఎగిరొస్తున్న బెలూన్లు పంజాబ్ రాష్ట్రంలోని సరిహద్దు గ్రామాల్లో కలకలం రేపుతున్నాయి. బెలూన్లపై హెచ్చరికలు, అసభ్య పదజాలంతో కూడిన వ్యాఖ్యలు రాసి వాటిని విడిచిపెడుతున్నారు. ఉర్దూలో ఈ హెచ్చరికలు ఉండడం గమనార్హం. ఇలా వచ్చిన మూడు డజన్ల బెలూన్లను పఠాన్ కోట్, ఫిరోజ్ పూర్, అమృత్ సర్ తదితర ప్రాంతాల్లో సరిహద్దు భద్రతాదళం స్వాధీనం చేసుకుంది. 'మా దగ్గర సహనం కత్తులు ఉన్నాయ్, మోదీకి ధైర్యం ఉంటే పాక్ ఆర్మీ సత్తా ఎంటో నేరుగా తలపడి చూసుకోవాలి' అంటూ పలు రకాల హెచ్చరికలను కాగితాలపై రాసి వాటిని బెలూన్లకు స్టిక్కర్లతో అంటించి విడిచి పెట్టినట్టు గుర్తించారు. అలాగే భారత భద్రతా బలగాలు, మహిళల పట్ల అసభ్య వ్యాఖ్యలు కూడా వాటిపై ఉన్నాయి. ఈ బెలూన్లను చూసిన స్థానికులు కంగారుతో భద్రతా సిబ్బందికి తెలియజేయడంతో వారు వాటిని స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News