: కాలువలో పడిన బీబీఆర్ ట్రావెల్స్ బస్సు.. ప్రయాణికులను రక్షించిన స్థానికులు
విశాఖపట్నం నుంచి గుంటూరు వెళ్తున్న ఓ బస్సు అదుపు తప్పి కాలువలో పడింది. ప్రయాణికులు చిన్నచిన్న గాయాలతో బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బీబీఆర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు విశాఖపట్నం నుంచి గుంటూరు బయలుదేరింది. పశ్చిమ గోదావరి జిల్లా తేతలి వద్దకు రాగానే ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న కాలువలో పడింది. ప్రమాదాన్ని గమనించిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని బస్సులో ఇరుక్కుపోయిన 40 మంది ప్రయాణికులను రక్షించి బయటకు తీశారు. ప్రమాదం అనంతరం డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు.