: నేను జయలలితను చూశాను... ఆమె కోలుకుంటున్నారు.. వైద్యులకు అభినందనలు: విద్యాసాగరరావు
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను చూశానని ఆ రాష్ట్ర ఇన్ ఛార్జీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు ప్రకటించారు. చెన్నైలోని అపోలో ఆసుపత్రికి రెండోసారి వెళ్లిన గవర్నర్ విద్యాసాగరరావు ఈ మేరకు ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. తాను జయలలితను చూశానని అందులో పేర్కొన్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో సుమారు 35 నిమిషాల పాటు చర్చించానని చెప్పారు. ఆమె వేగంగా కోలుకుంటున్నారని ఆయన తెలిపారు. ఆమె ఆరోగ్యం మెరుగవుతోందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని ఆయన భరోసా ఇచ్చారు. ఆమెకు సత్వర చికిత్స అందిస్తున్న నిపుణులు, అపోలో వైద్యులు, సిబ్బంది సేవలను ఆయన కొనియాడారు.