: టీమిండియా టెస్టు ఆటగాళ్ల శాలరీ డబుల్
బీసీసీఐ చీఫ్ అనురాగ్ ఠాకూర్ నేడు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆటగాళ్ల వేతనాలను సమీక్షించిన ఆయన టీమిండియా టెస్టు ఆటగాళ్ల వేతనాన్ని భారీగా పెంచారు. టెస్టు క్రికెటర్లకు బీసీసీఐ ఒక మ్యాచ్ కు 7 లక్షల రూపాయలు వేతనంగా చెల్లిస్తోంది. దీనిని బీసీసీఐ డబుల్ చేసింది. దీంతో ఈ వేతనం ఒక్కసారిగా 15 లక్షల రూపాయలకు చేరింది. ఈ వేతనం కేవలం తుదిజట్టులో స్థానం సంపాదించిన 11 మందికి మాత్రమే చెందుతుంది. రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లకు ఇంత వరకు చెల్లిస్తున్న 3.5 లక్షల రూపాయల స్థానంలో 7 లక్షలు చెల్లించనున్నారు. బీసీసీఐలో శాశ్వత సభ్యత్వం కలిగిన క్రికెట్ అసోసియేషన్ వార్షిక సబ్సిడీని అరవై కోట్ల నుంచి డబ్బై కోట్లకు పెంచుతూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.