: ఈడెన్‌ టెస్టు అప్ డేట్స్: నాలుగు వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్


కోల్‌కత్తాలోని ఈడెన్‌గార్డెన్స్ లో కొన‌సాగుతున్న భారత్‌-న్యూజిలాండ్‌ రెండో టెస్టు మొద‌టి ఇన్నింగ్స్‌లో టీమిండియా బౌల‌ర్లు కుమార్‌, మ‌హ‌మ్మ‌ద్ స్యామీ, జ‌డేజాలు విసిరిన బంతుల ధాటికి న్యూజిలాండ్ టాప్ ఆర్డ‌ర్ కుప్ప‌కూలింది. క్రీజులోకి వ‌చ్చిన మిడిల్ ఆర్డ‌ర్ బ్యాట్స్ మెన్ మాత్రం క్రీజులో నిల‌దొక్కుకున్నారు. టీమిండియాకు మొద‌టి ఇన్సింగ్స్‌లో బ్యాటింగ్‌లో ఎదురైన అనుభ‌వాలే న్యూజిలాండ్ చవిచూస్తోంది. న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్‌ గుప్టిల్ 13, లాథ‌మ్ ఒక్క ప‌రుగుకే వెనుదిరిగిన విష‌యం తెలిసిందే. ఆ త‌రువాత‌ క్రీజులో కాలు పెట్టిన నిచోల్స్ ఒక్క ప‌రుగుకే కుమార్ బౌలింగ్‌లో అవుట‌వ‌గా, మైదానంలో రాణించిన‌ రోచి 35 ప‌రుగుల వ‌ద్ద‌ జ‌డేజా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. టీ విరామం స‌మ‌యం నాటికి మైదానంలో టైల‌ర్ 30 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నాడు.

  • Loading...

More Telugu News