: అదుపుతప్పి వంతెనపై వేలాడుతున్న లారీ.. డ్రైవర్, క్లీనర్ క్షేమం
నిజామాబాద్ జిల్లా బిచ్కుంద మండలం పెద్ద ఎక్లారలో ఈరోజు ఉదయం ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలో రోడ్డు మార్గం గుండా వెళుతోన్న ఓ లారీ ఒక్కసారిగా అదుపుతప్పడంతో వంతెన అంచుపై నిలిచిపోయి, ప్రమాదకర స్థితిలో వేలాడుతూ ఉంది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జాం ఏర్పడింది. లారీలోని డ్రైవర్, క్లీనర్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వంతెనపై నుంచి ఆ లారీని తీసేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు. లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.