: న్యూఢిల్లీకి హుటాహుటీన బయలుదేరిన అమెరికా రాయబారి
ఇండియన్ ఆర్మీ లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్ఓసీ) దాటి మరీ చొచ్చుకెళ్లి సర్జికల్ స్ట్రయిక్స్ కు దిగిందని తెలియగానే ప్రపంచం దేశాలు ఉలిక్కిపడ్డాయి. దీంతో భారత్ లో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ హుటాహుటీన న్యూఢిల్లీకి బయలుదేరారు. ఈ విషయాన్ని వాషింగ్టన్ లో అమెరికా హోం శాఖ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ పేర్కొన్నారు. సర్జికల్ స్ట్రయిక్స్ వెలుగు చూసిన వెంటనే రిచర్డ్ వర్మ (భారత్ లోని అమెరికా రాయబారి) భారత్ సర్జికల్ స్ట్రయిక్స్ కు దిగడం ‘వెరీ డైనమిక్ సిచువేషన్’ అని పేర్కొన్నారని, విషయం తెలియగానే వాషింగ్టన్ నుంచి బయల్దేరి వెళ్లారని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను భారత్ లో ఉండాల్సిందేనని రిచర్డ్ వర్మ భావించారని ఆయన తెలిపారు.