: 'బాహుబలి 2' ఎంత వసూలు చేస్తుందన్నది ఇప్పుడే చెప్పలేను!: రాజమౌళి
'బాహుబలి' సినిమా చిరస్థాయిగా నిలుస్తుందని రాజమౌళి తెలిపారు. హాలీవుడ్ సినిమాల్లా తన సినిమా సిరీస్ లుగా రూపొందాలని ఆయన చెప్పారు. తాను 'బాహుబలి'తో ఆగిపోనని, ఎన్నో సినిమాలు చేస్తానని ఆయన తెలిపారు. 'బాహుబలి కన్ క్లూజన్' ఎంత వసూళ్లు చేస్తుందన్నది తాను ఇప్పుడే చెప్పలేనని ఆయన అన్నారు. వాస్తవం ఒకటి, ఊహ ఒకటి ఉంటుందని అన్నారు. వాస్తవం అయితే 'బాహుబలి బిగినింగ్' ఎంత వసూళ్లు చేసిందో, అంతకంటే 30 శాతం ఎక్కువ వసూళ్లు రావాలని ఆశిస్తున్నామని ఆయన తెలిపారు. ఇక బాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 సినిమాల్లో ఒకటిగా నిలవాలని భావిస్తున్నామని, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఇంతవరకు అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ టెన్ లో ఒకటిగా నిలవాలని భావిస్తున్నామని ఆయన చెప్పారు.