: జనాలేమనుకుంటే నాకేంటి?...నితీష్ కు నా సత్తా చూపిస్తా: షాబుద్దీన్


వివాదాస్పద ఆర్జేడీ మాజీ ఎంపీ మహ్మద్ షాబుద్దీన్ కు పాట్నా హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను సుప్రీంకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో తీవ్రవ్యాఖ్యలు చేశాడు. రెండు హత్య కేసుల్లో జీవిత ఖైదు అనుభవిస్తూ, పలు కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న షాబుద్దీన్ నేరుగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు అల్టిమేటం జారీ చేశాడు. కస్టడీకి తీసుకుంటున్న సందర్భంలో షాబుద్దీన్ మాట్లాడుతూ, 'నా గురించి ప్రజలు ఏమనుకున్నా పట్టించుకోను' అన్నాడు. న్యాయవ్యవస్థపై తనకు గౌరవముందని అన్నాడు. ముఖ్యమంత్రి నితిష్ కుమార్ విషయంలో తాను గతంలో చేసిన వ్యాఖ్యలకే కట్టుబడి ఉన్నానని ఆయన చెప్పారు. వచ్చేఎన్నికల్లో నితీష్ కుమార్ కు తన సత్తా చూపించేందుకు తన అనుచరులు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపాడు.

  • Loading...

More Telugu News