: అండర్-18 హాకీ విజేతగా నిలిచిన భారత్... హర్షం వ్యక్తం చేసిన రాజ్‌నాథ్ సింగ్


నిన్న పాకిస్థాన్‌తో జరిగిన ఆసియాక‌ప్ అండ‌ర్‌-18 హాకీ సెమీఫైన‌ల్‌ మ్యాచులో విజ‌యం సాధించి ఫైన‌ల్‌కు చేరిన భార‌త్ ఈరోజు కూడా అదే జోరును కొనసాగించింది. బంగ్లాదేశ్ రాజ‌ధాని ఢాకాలో జరిగిన ఫైనల్ లో గెలిచి ఆసియాక‌ప్ అండ‌ర్‌-18 హాకీ విజేతగా నిలిచింది. బంగ్లాదేశ్‌, భార‌త్ మ‌ధ్య నువ్వా నేనా? అన్నట్లుగా జ‌రిగిన మ్యాచులో 5-4 తేడాతో భార‌త్ గెలిచి, క‌ప్పుకొట్టేసింది. భార‌త‌ జాతీయ క్రీడ‌యిన హాకి క్రీడ‌లో భార‌త్ రాణించక‌పోవ‌డం ప‌ట్ల ఎన్నో విమ‌ర్శ‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. తాజా విజ‌యంతో అండ‌ర్-18 టీమ్ భార‌త అభిమానుల విజ‌య‌దాహాన్ని తీర్చింది. భార‌త్ విజ‌యం సాధించ‌డ‌మే ఆల‌స్యం, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్విట్ట‌ర్ ద్వారా ఈ అంశంపై వెంట‌నే స్పందించారు. భార‌త క్రీడాకారుల‌కు అభినంద‌న‌లు తెలుపుతున్న‌ట్లు పేర్కొన్నారు. భ‌విష్య‌త్తులో హాకీలోనూ ఇండియా మంచి విజ‌యాలు సాధిస్తుంద‌న్న సూచ‌న వ‌చ్చింద‌ని, త‌న‌కు ఎంతో ఆనందంగా ఉంద‌ని అన్నారు.

  • Loading...

More Telugu News