: కశ్మీర్ గవర్నర్ ను అక్కడి పరిస్థితులు అడిగి తెలుసుకున్న చంద్రబాబు
ప్రస్తుతం కశ్మీర్ లో నెలకొన్న పరిస్థితుల గురించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఈరోజు నిర్వహిస్తున్న ‘స్వచ్ఛ భారత్’ వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కశ్మీర్ గవర్నర్ ఎన్ఎన్ వోహ్రాతో చంద్రబాబు మంతనాలు జరిపారు. కశ్మీర్ పరిస్థితులు ప్రస్తుతం ప్రశాంతంగానే ఉన్నాయని ఆయన చెప్పినట్లు సమాచారం. కాగా, ‘స్వచ్ఛ భారత్’ వార్షికోత్సవ కార్యక్రమంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు తదితరుల పాల్గొన్నారు.