: విమానం బాత్రూమ్లో భారీగా ఐఫోన్లు, బంగారం, గుట్కాప్యాకెట్లు... శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘటన
హైదరాబాద్ శివారులోని శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న విమానంలోని బాత్‌రూంలో సిబ్బందికి ఓ బ్యాగు కనపడింది. దాన్ని తెరచిచూసిన కస్టమ్స్ అధికారులకు అందులో భారీగా ఉన్న పలు వస్తువులు బయటపడ్డాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం దుబాయ్ నుంచి అక్కడకు చేరుకున్న ఎయిర్ ఇండియా విమానంలోని బాత్‌రూంలో గుర్తు తెలియని వ్యక్తి ఓ బ్యాగు వదిలి వెళ్లిపోయాడు. అందులో 666 గ్రాముల బంగారం, 24 ఐఫోన్‌లు, 700 ఆర్‌ఎండీ గుట్కాప్యాకెట్లు, ఎనిమిది ఐఫోన్ బ్యాటరీలు, నాలుగు ఐప్యాడ్‌లు, ఐదు కిలోల సఫ్రాన్ ఇరానియం పౌడర్ ఉంది. వాటిని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు వాటి విలువ దాదాపు రూ. 50 లక్షల వరకు ఉంటుందని గుర్తించారు.