: నవ్యాంధ్రకు ‘కియా’ కార్ల కంపెనీ.. అనంతపురమా? నెల్లూరా?.. నేటి సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం!


హ్యుందయ్ సోదర సంస్థ కియా మోటార్స్ నవ్యాంధ్రలో కార్ల పరిశ్రమను స్థాపించేందుకు ముందుకు వచ్చింది. భారీ పెట్టుబడులతో అనంతపురం, లేదంటే నెల్లూరు జిల్లాలో పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. గురువారం కియా సంస్థ వైస్ ప్రెసిడెంట్ చెచీల్ స్ర్పాగ్ర్యూ, మరికొందరు ప్రతినిధులతో కలిసి అనంతపురంలో పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ఈ సంస్థను ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించింది. చంద్రబాబు ఆహ్వానానికి కియా అప్పట్లో సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు గురువారం సంస్థ అధికారి అయిన చెచీల్ స్వయంగా అనంతపురంలో జిల్లాలో పర్యటించారు. మరోవైపు నెల్లూరులోనూ పరిశ్రమ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న స్థలాలను ‘కియా’ పరిశీలించింది. అయితే పరిశ్రమను ఎక్కడ ఏర్పాటు చేయాలన్న విషయం మాత్రం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. నేడు కియా ప్రతినిధుల మధ్య జరిగే కీలక సమావేశంలో ఈ విషయంలో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. స్పోర్టేజ్, రియో, సోల్ పేరిట ఎస్‌యూవీలు, హ్యాచ్‌బ్యాక్ కార్లను ఉత్పత్తి చేస్తున్న కియా రాష్ట్రంలో అడుగుపెడితే వేలాదిమందికి ఉపాధి లభించే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News