: సైన్యం సూపర్... నా మద్దతు కేంద్రానికే: కేటీఆర్


పాకిస్థాన్‌ భూభాగంలోకెళ్లి మరీ ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడులు జరపడంపై తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌ లో స్పందించిన ఆయన, పాకిస్థాన్ లోని ఉగ్రవాద శిక్షణ శిబిరాలపై దాడులు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం హర్షణీయమని అన్నారు. సర్జికల్ స్ట్రయిక్స్ తో దేశ మొత్తం ఆర్మీ వెంట ఉందని అర్థం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. తమకు దేశమే ముఖ్యమని, అందుకే, కేంద్ర ప్రభుత్వానికి బలంగా మద్దతునిస్తున్నాని ఆయన ట్వీట్ చేశారు. కాగా, ఆయన ట్వీట్ కు తెలంగాణ యువత నుంచి మద్దతు లభిస్తోంది.

  • Loading...

More Telugu News