: రాశీ ఖన్నా మంచి డాన్సర్, యాక్టర్: రామ్ కితాబు


'హైపర్' సినిమా అందర్నీ ఆకట్టుకుంటుందని రామ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. రేపు విడుదలయ్యే ఈ సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని అంశాలు ఉన్నాయని చెప్పాడు. గతంలో 'కందిరీగ' సినిమాకు ఈ సినిమా దర్శకుడితో పని చేశానని, అది మంచి ఫలితం ఇచ్చిందని గుర్తుచేశాడు. ఇది మంచి కుటుంబ కథాచిత్రమని, ఇందులో కామెడీ, యాక్షన్ సమపాళ్లలో ఉంటాయని రామ్ చెప్పాడు. పాత్రల నుంచి కాకుండా సన్నివేశం నుంచి హాస్యం పడుతుందని రామ్ చెప్పాడు. రాశీ ఖన్నా చాలా బాగా, సహజంగా నటించిందని అన్నాడు. బాగా డాన్స్ చేసిందని, ఇంకా బాగా నటించిందని అన్నాడు. సత్యరాజ్ గారు స్క్రీన్ పై సీరియస్ గా ఉంటారని, ఈ సినిమాలో ఆయనను డిఫరెంట్ గా చూపించామని చెప్పాడు. నిజజీవితంలో ఆయన చాలా జోవియల్ గా ఉంటారని, ఆయనలోని ఆ యాంగిల్ ని ఈ సినిమాలో వాడేశామని, ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంటుందని రామ్ చెప్పాడు.

  • Loading...

More Telugu News