: సర్జికల్ స్ట్రయిక్స్ అంటే...? భారత ఆర్మీ చేసిన దాడులు ఇవే!
పాక్ అక్రమిత కశ్మీర్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై బుధవారం రాత్రి సర్జికల్ స్ట్రయిక్స్ చేసినట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో) లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ చేసిన ప్రకటన చాలా మందిని ఒక్కసారిగా షాక్ కు గురిచేసింది. ఈ నేపథ్యంలో సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఏంటో చూద్దాం. సర్జికల్ స్ట్రయిక్స్ అనేవి నిర్ణీత లక్ష్యాలపై చేసే దాడులు. ఆ లక్ష్యాన్నే బాగా దెబ్బతీసేలా ఉంటాయి ఇవి. అంటే మిగిలిన ప్రాంతాలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా జరిపేటటువంటి దాడులు. లక్ష్యంగా ఎంచుకున్న ప్రాంతానికి సమీపంలో ఉండే ప్రజలకు, భవనాలు, వాహనాలకు కూడా ఎలాంటి నష్టం జరగదు. ఇటీవల ఆర్మీకి చెందిన 70 మంది కమాండోలు మయన్మార్ లో ఇటువంటి ఆపరేషనే నిర్వహించారు. 40 నిమిషాల్లో ఆపరేషన్ ముగించి 38 మంది నాగా వేర్పాటువాదులను మట్టుబెట్టారు. సర్జికల్ స్ట్రయిక్స్ లో భాగంగా బాంబుల విడుదల కూడా ఉంటుంది. దీని ద్వారా లక్ష్యానికి అపార నష్టం కలిగేట్టు చేస్తారు.