: ఈరోజు సాయంత్రం అఖిలపక్ష సమావేశం


నియంత్రణ రేఖ వద్ద భారత సైన్యం దాడుల అంశంపై చర్చించే నిమిత్తం ఈరోజు సాయంత్రం అఖిల పక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు జరగనున్న ఈ సమావేశానికి అన్ని పార్టీల నేతలు హాజరుకావాలని పిలుపు నిచ్చారు. కాగా, గత రాత్రి పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాదుల స్థావరాలపై భారత సైన్యం దాడులు నిర్వహించి, ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు డీజీఎంవో రణ్ బీర్ సింగ్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News