: యాదాద్రిలో భారీ ఆంజనేయ విగ్రహం ఏర్పాటుకు కేసీఆర్ ఆమోదం
యాదాద్రిలో ద్వార పాలకుడిగా భారీ ఆంజనేయ విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఇందుకు సంబంధించిన విగ్రహ నమూనాను సీఎం కేసీఆర్ ఆమోదించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి లక్ష్మారెడ్డి, సీఎస్ రాజీవ్ శర్మతో కలిసి ఈ నమూనాను కేసీఆర్ పరిశీలించారు. యాదాద్రిలో 108 అడుగుల ఆంజనేయుడి పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు.