: కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి.. ఆంధ్రప్రదేశ్‌కి వర్షసూచన
ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. దక్షిణ ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని, విదర్భ, ఛత్తీస్గఢ్లపై ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమై ఉందని వారు తెలిపారు. వీటి ప్రభావంతోనే వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఇక, రాయలసీమలో చెదురుమదురు వర్షాలు పడతాయని పేర్కొన్నారు.