: హైదరాబాద్‌లో యువకుడి దారుణహత్య.. ప్రేమ వ్యవహారమే కారణం!


హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. స్థానిక సచివాలయ నగర్‌లో ప్రైవేటు ఉద్యోగి అయిన లలిత్ ఆదిత్యను కొందరు దుండగులు కత్తులతో దారుణంగా పొడిచి చంపారు. ఈ తెల్లవారుజామున కారులో వచ్చిన దుండగులు లలిత్‌పై దాడిచేసి విచక్షణ రహితంగా పొడిచి హత్య చేశారు. ఈ హత్యకు ప్రేమ వివాహమే కారణమని తెలుస్తోంది. లలిత్ 8 నెలల క్రితం సుస్మితా రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే వీరి మధ్య విభేదాలు తలెత్తడంతో సుస్మిత ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో లలిత్ హత్య జరగడం కలకలం రేపింది. ఆయన హత్యకు ప్రేమ వివాహమే కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. యువకుడిని హత్య చేసిన అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News