: ‘దసరా’ ఎఫెక్ట్.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో ప్లాట్ ఫాం టికెట్ ధర పెంపు
దసరా పండగ సందర్భంగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిన దక్షిణ మధ్య రైల్వే మరో నిర్ణయం కూడా తీసుకుంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో ప్లాట్ ఫాం టికెట్ ధరను రూ.10 నుంచి రూ.20కు పెంచుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల 30 నుంచి అక్టోబరు 12వ తేదీ వరకు ఈ టికెట్ ధర అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. ఈరోజు నుంచి ఆయా మార్గాల్లో ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడుపుతోంది.