: పాక్ అనుకూల నినాదాల ప్రభావం... 200 మంది కాంగ్రెస్ కార్యకర్తలపై దేశద్రోహం కేసు నమోదు
ఇటీవల యూరీలో ఉగ్రవాదులు చొరబడి 18 మంది భారత సైనికులని బలితీసుకున్న విషయం తెలిసిందే. వారికి నివాళిగా ఉత్తర ప్రదేశ్‌లోని మోరాదాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ మూడు రోజుల క్రితం భారీ ర్యాలీ కూడా నిర్వహించింది. అయితే, ర్యాలీలో సైనికులకు అవమానం కలిగేలా పాకిస్థాన్ అనుకూల నినాదాలు వినిపించాయి. కాంగ్రెస్ జిందాబాద్, పాక్ జిందాబాద్ అంటూ వారు రెచ్చిపోయి అరిచారు. ఈ దృశ్యాలను ఓ న్యూస్ ఛానల్ ప్రసారం చేయడంతో స్పందించిన యూపీ పోలీసులు ఆ ర్యాలీలో పాల్గొన్న 200 మంది కాంగ్రెస్ కార్యకర్తలపై దేశద్రోహం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.