: మెడికల్ కౌన్సెలింగ్ గడువును అక్టోబర్ 7 వరకు పొడిగించిన సుప్రీంకోర్టు
తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు మెడికల్ కౌన్సెలింగ్ గడువును అక్టోబర్ 7 వరకు పొడిగిస్తున్నట్లు సుప్రీంకోర్టు ఈరోజు ప్రకటించింది. కౌన్సెలింగ్ కు మరో నెల రోజులు గడువు కావాలని మొదట తెలంగాణ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా, తెలంగాణకు గడువు పొడిగిస్తే తమ రాష్ట్ర విద్యార్థులకూ పొడిగించాలని ఆంధ్రప్రదేశ్ కూడా పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు వేసిన పిటిషన్లపై ఈరోజు విచారణ జరిపిన దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈ విధంగా ఆదేశాలు జారీ చేసింది.