: స్నేహితుడి మరణం తట్టుకోలేక యువకుడి ఆత్మహత్య
హైదరాబాద్లోని కూకట్పల్లి మూసాపేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. బైక్పై వెళుతూ ఘంటా హరికృష్ణ, కె.రమేశ్ అనే యువకులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. బైక్పై వెనుక కూర్చున్న హరికృష్ణ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే, తన స్నేహితుడి మరణాన్ని చూసితట్టుకోలేక రమేశ్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులు ఇద్దరూ గుంటూరు జిల్లా కారంపూడి గ్రామానికి చెందిన వారుగా తెలిపారు. హరికృష్ణ హైదరాబాదులో ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు, రమేశ్ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.