: వాళ్లమ్మాయిని చూసి ఆగిపోయా... ఈసారి ముఖాముఖిలో నా తడాఖా ఏంటో హిల్లరీకి చూపిస్తా: డొనాల్డ్ ట్రంప్


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల మధ్య సాగిన తొలి ముఖాముఖి 'బిగ్ డిబేట్'లో డెమోక్రాట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కు మంచి మార్కులు రావడంపై ట్రంప్ తనదైన శైలిలో స్పందించారు. ఈ ముఖాముఖిని చూస్తున్న వారిలో హిల్లరీ కుమార్తె చెల్సియా కూడా ఉందని, ఆమె ముందు హిల్లరీ భర్త శృంగార రాసలీలలను ఎత్తకూడదనే ఆగిపోయానని అన్నారు. తదుపరి చర్చలో హిల్లరీని మరింత బలంగా ఎదుర్కొంటానని చెప్పారు. మాజీ అధ్యక్షుడు, హిల్లరీ భర్త బిల్ క్లింటన్ రాసలీలలను ఎత్తి చూపుతానని హెచ్చరించారు. "నేను నిజంగా చాలా తగ్గి మాట్లాడాను. వాస్తవానికి నాకు ఎవరి మనోభావాలనూ దెబ్బతీయాలని లేదు. బిల్ క్లింటన్ కు ఎంతో మందితో సంబంధాలు ఉన్నాయి. వాటిని ప్రస్తావించాల్సింది. కానీ ఆడియన్స్ లో చెల్సియా క్లింటన్ ఉంది. అందుకే ఆగిపోయా" అని ఫాక్స్ న్యూస్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఈ చర్చ తరువాత హిల్లరీకి మద్దతు పెరిగినట్టు వచ్చిన వార్తలను తాను నమ్మడం లేదని అన్నారు. 1996 మిస్ యూనివర్స్ విజేత అలీసియా మచాడో ప్రస్తావనను హిల్లరీ తెచ్చిన వేళ, తాను చిరాకు పడ్డానని చెప్పారు. తదుపరి డిబేట్ కు మరిన్ని అస్త్రాలతో వచ్చి హిల్లరీని ముప్పుతిప్పలు పెడతానని చెప్పారు.

  • Loading...

More Telugu News