: తెలంగాణ పౌరసరఫరాల సంస్థ బంపరాఫర్.. లోగో డిజైన్ చేస్తే బహుమతి ఇస్తామంటూ ప్రకటన


తెలంగాణ పౌరసరఫరాల సంస్థ బంపరాఫర్ ప్రకటించింది. తమ సంస్థకు మంచి లోగో తయారుచేసి ఇచ్చిన వారిని బహుమతితో సత్కరిస్తామని ఆ శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. అక్టోబరు 5వ తేదీలోపు లోగో డిజైన్ చేసి ఇచ్చిన వారికి తగిన బహుమతి ఇస్తామని పేర్కొన్నారు. డిజైన్ చేసిన లోగో నమూనాను ఈ మెయిల్ ద్వారా కానీ, పోస్టు ద్వారా కానీ పంపించాలని కోరారు. మరిన్ని వివరాల కోసం protscsc@telangana.gov.in వెబ్‌సైట్‌ను కానీ, 7702003518, 7702003505 ఫోన్ నంబర్లలో కానీ సంప్రదించాలని కోరారు.

  • Loading...

More Telugu News