: రెండు నెలల పాటు క్రికెట్ కు డివిలియర్స్ దూరం
సౌతాఫ్రికా విధ్వంసకర ఆటగాడు ఏబీ డివిలియర్స్ రెండు నెలల పాటు క్రికెట్ కు దూరం కానున్నాడు. మోచేతి నొప్పితో బాధపడుతున్న డివియలీర్స్ ఫిట్ నెస్ పరీక్షలో విఫలమయ్యాడని జట్టు ఫిజియో మహ్మద్ మూసజీ తెలిపారు. మోచేతి గాయానికి గతంలో చికిత్స తీసుకున్నప్పటికీ అది పూర్తి స్థాయిలో నయం కాలేదని ఆయన పేర్కొన్నారు. అది తిరగబెట్టడంతో పూర్తి స్థాయి ఉపశమనం కోసం డివిలియర్స్ కు శస్త్ర చికిత్స జరగనుందని ఆయన వెల్లడించారు. శస్త్ర చికిత్స అనంతరం రెండు నెలలు విశ్రాంతి అవసరమని ఆయన తెలిపారు. క్రిస్ మస్ తరువాత జరగనున్న శ్రీలంక సిరీస్ నాటికి డివిలియర్స్ జట్టులో చేరుతాడని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో రెండు నెలలపాటు డివిలియర్స్ బ్రాండ్ 360 డిగ్రీల షాట్లను క్రికెట్ ప్రపంచం మిస్ కానుంది.