: ‘ఖైదీ నంబర్ 150’లో మెగాస్టార్ న్యూ లుక్ స్టిల్స్ అదిరాయి!
మెగాస్టార్ చిరంజీని 150 వ చిత్రం ‘ఖైదీ నంబర్ 150’లో చిరు న్యూ స్టిల్స్ విడుదలయ్యాయి. చిత్ర నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ చిరుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. కాగా, మెగా స్టార్ న్యూలుక్ పై అభిమానులు ప్రశంసలు కురిపించారు. రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. వీవీ వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది.