: కాశ్మీర్ లో తీవ్రవాద శిబిరం గుట్టురట్టు చేసిన పోలీసులు, ఆర్మీ
యూరీ సెక్టార్ ఘటన అనంతరం జమ్ముకశ్మీర్ లో తీవ్రవాదుల కదలికలపై గట్టి నిఘా పెట్టిన ఇండియన్ ఆర్మీ... పోలీసులతో కలిసి సోదాలు జరుపుతోంది. ఈ సోదాల్లో ఓ ఉగ్ర శిబిరం గుట్టు రట్టైంది. దోడాలో ఆర్మీ, పోలీసులు కలిసి జరిపిన కూంబింగ్ లో ఈ స్థావరాన్ని గుర్తించారు. ఇందులోంచి ఒక ఏకే-47 తుపాకి, 12 ఎంఎం బోర్ రైఫిళ్లు ఎనిమిది, మూడు గ్రనేడ్లు, రెండు పిస్టళ్లు, 2263 రౌండ్ల బుల్లెట్లు, రెండు రేడియో సెట్లు, రెండు మ్యాపులను స్వాధీనం చేసుకున్నారు. దీంతో మరిన్ని చోట్ల సోదాలు ముమ్మరం చేశారు. తీవ్రవాదుల ఆటకట్టించాలని ఆర్మీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.