: పులిచింతల బాధితుల కోసం పోరాటం చేస్తా: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
తెలంగాణ ప్రభుత్వంపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. పులిచింతల ముంపు గ్రామం రేబల్లెలో ఈ రోజు పలువురు పార్టీ నేతలతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ముంపు బాధితులకు న్యాయం చేసే విషయంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి కనబరుస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో పులిచింతల బాధితులకు పరిహారం అందిందని ఆయన చెప్పారు. ముంపు బాధితుల కష్టాలు ప్రభుత్వానికి పట్టడం లేదని ఆయన అన్నారు. బాధితుల తరఫున తాను పోరాడతానని చెప్పారు.