: హైదరాబాదులో హైటెక్ వ్యభిచారం.. ఢిల్లీ అమ్మాయిల అరెస్ట్
హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న ఒక ముఠా గుట్టు రట్టయింది. రాచకొండ సర్కిల్ ఎస్ వోటి పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం, ఢిల్లీ నుంచి వచ్చిన 8 మంది యువతులు ‘లొకంటో’ అనే వెబ్ సైట్ ద్వారా విటులకు వల వేస్తున్నట్లు చెప్పారు. ఈ వెబ్ సైట్ పై దృష్టి పెట్టడంతో యువతులు చేస్తున్న వ్యభిచారం వెలుగుచూసింది అన్నారు. హైదరాబాద్ లోని స్టార్ హోటల్స్ లో వీరు వ్యాపారం సాగిస్తున్నారని, రోజుకు నలభై వేల చొప్పున తీసుకుంటారని పేర్కొన్నారు. మొత్తం ఎనిమిది మంది యువతులను, ఇద్దరు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. అదుపులోకి తీసుకున్న యువతులలో నలుగురు బీటెక్ విద్యార్థినులు ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. అదుపులోకి తీసుకున్న యువతులను ప్రభుత్వ రెస్క్యూ హోంకు తరలించినట్లు సమాచారం.