: పుట్టే బిడ్డ పేరు 'సైఫీనా': కరీనాకపూర్


తమకు పుట్టబోయే బిడ్డకు సైఫీనా అని పేరు పెట్టనున్నట్టు బాలీవుడ్ నటి కరీనా కపూర్ వెల్లడించింది. డిసెంబరులో తనకు బిడ్డ పుట్టనుందని, ఈ బిడ్డకు తన భర్త సైఫ్ అలీ ఖాన్ పేరు, తన పేరు కలిసొచ్చేలా సైఫీనా అన్న పేరును పెట్టాలని నిర్ణయించామని, ఈ పేరును సైఫ్ ఎంపిక చేశాడని చెప్పుకొచ్చింది. త్వరలో దుబాయ్ కి వెళ్లి, కొద్ది రోజుల విశ్రాంతి తరువాత తిరిగి అక్టోబరులో ఇండియాకు వస్తామని చెప్పింది. కాగా, మరో సెలబ్రిటీ జంట షాహిద్ కపూర్, మీరా రాజ్ పుత్ లు తమకు ఓ ఆడబిడ్డ పుడితే, ఇద్దరి పేర్లలోని మొదటి అక్షరాలను కలుపుతూ 'మీషా' అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సైఫ్-కరీనా జంట కూడా అదే దారిలో వెళుతోందన్నమాట!

  • Loading...

More Telugu News