: పాక్ ను టెర్రరిస్టు దేశంగా ప్రకటిద్దామా?: వైట్ హౌస్ ఆన్ లైన్ పిటిషన్ పై లక్ష సంతకాలు... ఇక ఒబామా సమాధానం చెప్పాల్సిందే!


ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశంగా పాకిస్థాన్ ను ప్రకటించాలా? వద్దా? అన్న విషయమై ఇప్పుడు ఒబామా సర్కారు తప్పనిసరిగా తన నిర్ణయాన్ని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంలో ప్రజాభిప్రాయాన్ని కోరుతున్న ఆన్ లైన్ వైట్ హౌస్ పిటిషన్ పై లక్షకు పైగా సంతకాలు వచ్చాయి. దీంతో ఈ పిటిషన్ అధికారిక స్పందన కోసం క్వాలిఫై అయింది. గత వారంలో ఇండియన్-అమెరికన్ సంఘం ఒకటి వైట్ హౌస్ అధికారిక వెబ్ సైట్లో ఈ పిటిషన్ ఉంచింది. ఈ నెల 21న పిటిషన్ రాగా, దీనిపై అభిప్రాయం చెప్పాల్సిందేనని ఇప్పటివరకూ 1.10 లక్షల సంతకాలు వచ్చాయి. దీంతో నిబంధనల ప్రకారం 60 రోజుల్లోగా అమెరికా ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. కాగా, ఇప్పటికే ఉగ్రవాదంపై హౌస్ సబ్ కమిటీ చైర్మన్ టెడ్ పోయ్, మరో సభ్యుడు డానా రోహ్రాబకర్ లు పాకిస్థాన్ ను ఉగ్రదేశంగా ప్రకటించాల్సిందేనని ప్రతినిధుల సభలో ఓ బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News