: సుగంధ పరిమళాలు వెదజల్లుతున్న తిరుమలేశుని సన్నిధి


వచ్చే నెల 3వ తేదీ నుంచి 11 వరకూ శ్రీ వెంకటేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్న సందర్భంగా శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వైభవంగా సాగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు ఇతర అధికారులు, టీటీడీ సభ్యులు ఈ వేడుకలో పాల్గొన్నారు. చందన కర్పూరాది సుగంధ ద్రవ్యాలతో ఆలయాన్ని శుద్ధి చేసే కార్యక్రమం ముగిసింది. తిరుమల దేవాలయం ఇప్పుడు సుగంధ పరిమళాలు వెదజల్లుతోంది. తిరుమంజనం నిర్వహిస్తున్న సందర్భంగా గత రాత్రి 2 గంటల నుంచి దర్శనాలను నిలిపివేయగా, మరో గంట తరువాత భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తామని అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News