: అమెరికాలో మరోమారు పేలిన గన్.. దుండగుడి కాల్పుల్లో తొమ్మిది మందికి గాయాలు


అమెరికాలో కాల్పుల సంస్కృతి కొనసాగుతోంది. సోమవారం హూస్టన్‌లోని ఓ షాపింగ్‌మాల్‌లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో తొమ్మిది మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని జరిపిన కాల్పుల్లో ఆగంతకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. సోమవారం ఉదయం మాల్ లోకి ప్రవేశించిన దుండగుడు ఏకే-47, ఏఆర్-15 తుపాకులతో వంద రౌండ్లకు పైగా కాల్చినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆగంతకుడు ఓ న్యాయవాది అని, అతనికి తన 'లా' సంస్థకు సంబంధించి చాలా సమస్యలు ఉన్నట్టు సమాచారం. అయితే దుండగుడి వివరాలను వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. కాగా ఈ నెల 17న మిన్నెసొటా షాపింగ్‌మాల్‌లో 20 ఏళ్ల యువకుడు జరిపిన దాడిలో పదిమంది మృతి చెందిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News