: వర్షాల‌కి నాశ‌న‌మైన పంట‌ మొక్క‌ను చేతితో ప‌ట్టుకొని జ‌గ‌న్ నిర‌స‌న


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఈ రోజు గుంటూరు జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. దాచేపల్లిలో ఆయ‌న రైతుల‌తో ముచ్చటించారు. భారీవ‌ర్షాల ధాటికి త‌మ పంట‌ల‌న్నీ నాశ‌నమ‌య్యాయ‌ని రైతులు జ‌గ‌న్‌తో తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఓ పంట‌మొక్క‌ను త‌న చేతిలో ప‌ట్టుకొని, ప్ర‌భుత్వం రైతుల‌ను ఆదుకోవ‌డం లేదంటూ నిర‌స‌న తెలిపారు. రైతుల‌కు ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం అండ‌గా నిలవాలని డిమాండ్ చేశారు. రైతులు కూడా త‌మ చేతిలో మొక్క‌లు ప‌ట్టుకొని నిర‌స‌న తెలిపారు.

  • Loading...

More Telugu News