: ఉత్తరాఖండ్ లో భూ ప్రకంపనలు
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్ర ప్రయాగలో ఈరోజు మధ్యాహ్నం స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో, ప్రజలు భయాందోళనలకు గురై, ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖాధికారులు మాట్లాడుతూ, ఈరోజు మధ్యాహ్నం 3.11 గంటలకు భూమి కంపించిందని, రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 3.7గా నమోదు అయినట్లు చెప్పారు. అయితే, ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగినట్లు తమకు ఎటువంటి సమాచారం అందలేదని చెప్పారు.