: వేలు చూపుతూ ఏకే-47 పేల్చి మోదీకి వార్నింగ్ ఇచ్చిన పాకిస్థాన్ పాప... మీరూ చూడండి!
భారత్ ను అస్థిర పరచడమే లక్ష్యంగా పాకిస్థాన్ ఎంతటి అరాచకాలకు దిగుతుందో చెబుతున్న ఉదాహరణ ఇది. పాకిస్థాన్ చిన్నారుల్లో సైతం విషం నింపుతోంది. పట్టుమని ఐదేళ్లయినా లేని పాపాయి చేత ఏకే-47 గన్ పట్టించి ఏకంగా మోదీకి వార్నింగ్ ఇచ్చేలా చేస్తోంది. చెబుతున్న మాటలు ఏంటన్నది అర్థమయ్యేలా చెప్పేంత స్పష్టత లేని ఆ పాప, తన తండ్రి పక్కన కూర్చుని మోదీకి వార్నింగ్ ఇస్తూ, తుపాకీని పేలుస్తున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దగ్గరుండి కూతురికి గన్ ఎలా పేల్చాలో నేర్పిస్తున్న అతడెవరో తెలియరాలేదుగానీ, ఈ వీడియోను చూసిన భారతీయులు మాత్రం మండి పడుతున్నారు.