: జగన్‌ను స్ఫూర్తిగా తీసుకోమని యువతకు చెప్పగలరా?: టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య
ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి నిన్న రాత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రవాసాంధ్రులతో చర్చించడం పట్ల టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు కర్నూలు జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ఏ అర్హతతో ఆ కార్యక్రమం నిర్వహించారని ఆయన ప్రశ్నించారు. జగన్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని యువతకు చెప్పే ధైర్యం జగన్ తల్లి విజయమ్మకు ఉందా? అని ఆయన అన్నారు. వైసీపీ అధినేత చేసిన అవినీతి వల్ల ఎంతో మంది ఐఏఎస్‌లు నానా ఇబ్బందులు పడ్డారని ఆయన అన్నారు. కాపుల బహిరంగ సభ సందర్భంగా తునిలో జరిగిన విధ్వంసం కేసులో జగన్ పాత్రపై విచారణ జరిపించాల్సి ఉందని వ్యాఖ్యానించారు.