: ఎంపీలతో రాజీనామా చేయించే దమ్ము చంద్రబాబుకు ఉందా?: భూమన కరుణాకర్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. ఈరోజు తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... మన్నవరం ప్రాజెక్ట్ తరలిపోతుంటే సీఎం దాన్ని ఆపకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు కూడా తరలిపోతున్నాయని ఆయన అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆనాడు ఎంతో కష్టపడి మన్నవరం ప్రాజెక్ట్ సాధ్యమయ్యేలా చేశారని ఆయన అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక సాయం వల్లే పరిశ్రమలు వస్తాయని చెబుతున్న నేతల మాటలు అన్నీ అసత్యాలేనని ఆయన వ్యాఖ్యానించారు. హోదా కోసం వైసీపీ ఎంపీలతో రాజీనామా చేయిస్తామని తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారని, చంద్రబాబుకు టీడీపీ ఎంపీలతో రాజీనామా చేయించే దమ్ము ఉందా? అని ఆయన ప్రశ్నించారు.