: ఏలూరు కలెక్టరేట్ వద్ద కలకలం.. పోలీసుల వేధింపులు తాళలేక వ్యక్తి ఆత్మహత్యాయత్నం
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద ఈరోజు ఉదయం కలకలం రేగింది. పురుగుల మందు చేతిలో పెట్టుకుని వచ్చిన అచ్యుతనాథరాజు అనే వ్యక్తి ఆ కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసుల వేధింపులు తాళలేకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాసి ఈ ప్రయత్నం చేశాడు. దీనిని గమనించిన అక్కడి సిబ్బంది అతడిని వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు మీడియాకు తెలిపారు. ఈ విషయాన్ని అచ్యుతనాథరాజు కుటుంబ సభ్యులకు తెలియజేశారు.