: పెవీలియన్ కు చేరేందుకు న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ల క్యూ!
భారత స్పిన్నర్లను, మీడియం పేసర్లను ఎదుర్కోవడంలో న్యూజిలాండ్ ఆటగాళ్లు విఫలమయ్యారు. చేతిలో ఆరు వికెట్లతో డ్రా లక్ష్యంగా బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టులోని మూడు కీలక వికెట్లను భారత బౌలర్లు తీశారు. 158 పరుగుల వద్ద రోంచీ వికెట్ పడిపోగా, ఆపై 194 పరుగుల వద్ద వాట్లింగ్, 196 పరుగుల వద్ద క్రెయిగ్ లు పెవీలియన్ చేరారు. వీరిద్దరి వికెట్లనూ మహమ్మద్ షమీ రెండు వరుస బంతుల్లో తీయడం గమనార్హం. 68వ ఓవర్ ఆఖరిబంతికి వాట్లింగ్ ను బోల్తా కొట్టించిన షమీ, 70వ ఓవర్ తొలి బంతికి క్రెయిగ్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో న్యూజిలాండ్ స్వల్ప వ్యవధిలో మూడు కీలక వికెట్లను కోల్పోయినట్లయింది. ప్రస్తుతం శాట్ నర్ ఒక్కడే 50 పరుగుల వ్యక్తిగత స్కోరును దాటి ఒంటరి పోరాటం చేస్తున్నాడు. న్యూజిలాండ్ 72 ఓవర్లలో 204 పరుగులు చేయగా, భారత్ గెలవాలంటే మరో 3 వికెట్లు తీయాల్సివుంది.