: విసిరేసిన బిస్కెట్ ప్యాకెట్ అందుకోలేకపోయిన హైదరాబాద్ యువతి బాధ... సోషల్ మీడియాలో వైరల్


హైదరాబాద్ ను భారీ వర్షాలు చుట్టు ముట్టిన సమయంలో, పలు లోతట్టు ప్రాంతాల్లోని అపార్టుమెంట్లు జలమయమైన సంగతి తెలిసిందే. ఇక్కడున్న ప్రజలను ఆదుకుని, వారికి ఆహారాన్ని, మంచినీటిని, పాల ప్యాకెట్లను అందించేందుకు పలువురు దాతలు ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆల్విన్ కాలనీలో జరిగిన ఓ ఘటన తాలూకు దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ధరణి నగర్ లోని ఓ అపార్టుమెంటు వద్ద తమకు సాయం చేసేందుకు వచ్చిన ఓ వ్యక్తి బిస్కెట్ ప్యాకెట్ ను విసిరితే, దాన్ని అందుకోలేకపోయిందామె. సెల్లార్ మొత్తం నీటితో నిండగా, ఆ యువతి కిందకు వచ్చి సాయాన్ని తీసుకునే పరిస్థితి లేదు. దాంతో కిందనుంచి బిస్కెట్ ప్యాకెట్ విసరగా, దాన్ని అందుకోలేని ఆమె, ఆపై బాధపడటాన్ని కెమెరాలు క్లిక్ మనిపించాయి. ఒక్క బిస్కెట్ ప్యాకెట్ కోసం ఆమె తాపత్రయం, బాధకు సంబంధించిన దృశ్యాలను మీరూ చూడవచ్చు.

  • Loading...

More Telugu News