: జైపాల్ రెడ్డిగారూ.. నాది కట్టుకథ అయితే.. వాస్తవం ఏమిటో బయటపెట్టండి: ఉండవల్లి అరుణ్ కుమార్


‘విభజన కథ- నా డైరీలో కొన్ని పేజీలు’లో కొన్ని అంశాలపై కథ అల్లారంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆ పుస్తక రచయిత ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. ఒక న్యూస్ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన సమయంలో జరిగిన పరిణామాల గురించి రాసిన ఆ పుస్తకంలో కొన్ని అంశాలు ఊహించి రాశానని ముందే చెప్పానని, ఇప్పుడు జైపాల్ రెడ్డి ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయమేమీ లేదన్నారు. విభజన బిల్లు ఆమోదం సమయంలో లోక్ సభ తలుపులు ఎందుకు మూసేశారన్న విషయం గురించి బయటవారికి ఏమీ తెలియదని, తెలియనప్పుడు.. ఊహించి రాయడంలో తప్పేమీ లేదని అన్నారు. మరి, తాను ఊహించి రాశానని ఆయన చెబుతున్నారు కాబట్టి, అసలు, ఆ రోజు లోక్ సభలో జరిగిన వాస్తవాలేమిటో జైపాల్ రెడ్డి బయటపెట్టాలని.. ఇది ప్రజలకు సంబంధించిన విషయమని ఉండవల్లి కోరారు.

  • Loading...

More Telugu News