: కదిరిలో డీసీహెచ్ఓ చొక్కా చించేసి, దాడికి పాల్పడిన సీపీఐ
అనంతపురం జిల్లా కదిరిలో డీసీహెచ్ఓ రమేష్ పై సీపీఐ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. కదిరి ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేయడానికి వచ్చిన రమేష్ పై సీపీఐ నాయకులు దాడి చేశారు. ఆసుపత్రిలో సమస్యలున్నా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఆయనపై దాడికి దిగారు. ఆయన చొక్కాను చించేశారు. రమేష్ ఇక్కడికి వస్తున్న సమాచారాన్ని ముందుగానే తెలుసుకున్న సీపీఐ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఎంతోకాలంగా ఆసుపత్రిలో సమస్యలు పరిష్కారం కావడం లేదని, పట్టించుకోవడం లేదని సీపీఐ కార్యకర్తలు నినాదాలు చేశారు.