: న్యూజిలాండ్ పై 400 పరుగులు దాటిన భారత్ లీడ్
న్యూజిలాండ్ తో జరుగుతున్న పేటీఎం తొలి టెస్టులో భారత ఆధిక్యత 400 పరుగులు దాటింది. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ సాధించడం, అతనికి జడేజా అండగా నిలవడంతో భారత్ భారీ స్కోరు దిశగా సాగింది. రోహిత్ 60 పరుగులు, జడేజా 31 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత స్కోరు 104 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 350 పరుగులు కాగా, లీడ్ 406 పరుగులు దాటింది. దీంతో టీ విరామానికి భారత్ తన ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచ క్రికెట్ చరిత్రలో 400 పరుగులు దాటిన స్కోరును సెకండ్ ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ గెలిచిన దాఖలాలు రెండు మాత్రమే ఉన్నాయి. దీంతో ఏదైనా అద్భుతం జరిగితేనే న్యూజిలాండ్ ఈ మ్యాచ్ లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఇక న్యూజిలాండ్ ఆటగాళ్లను అవుట్ చేయడంలో మన బౌలర్లు విఫలమైతే, మ్యాచ్ డ్రా అవుతుంది.