: న్యూజిలాండ్ పై 300 దాటిన లీడ్... విజయంపై ఆశలు!


కాన్పూర్ లో జరుగుతున్న పేటీఎం టెస్టు సిరీస్ తొలి మ్యాచ్ నాలుగో రోజు భారత్ పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్ లో 318 పరుగుల స్కోరు చేసి, న్యూజిలాండ్ ను 262 పరుగులకే కట్టడి చేసిన భారత జట్టు, నేడు రెండో ఇన్నింగ్స్ ను కొనసాగిస్తూ, తనకున్న లీడ్ ను 308 పరుగులకు పెంచుకుంది. ఎవరూ సెంచరీలతో రాణించకున్నా, అందరూ సమష్టిగా ఆడుతూ, స్కోరు బోర్డు పెరిగేందుకు తమ వంతు సాయం చేస్తున్నారు. సెంచరీ సాధిస్తాడని భావించిన పుజారా 78 పరుగుల వ్యక్తిగత స్కోరు (152 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో) వద్ద సోధీ బౌలింగ్ లో టేలర్ కు క్యాచ్ ఇచ్చాడు. ప్రస్తుతం రహానే 21, రోహిత్ శర్మ 12 పరుగులతో ఆడుతుండగా, భారత స్కోరు 81 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 252 పరుగులు. మరో 100 పరుగులకు పైగా భారత్ సాధిస్తే, మ్యాచ్ ని చేజారిపోనివ్వకుండా చూసుకుని న్యూజిలాండ్ పై గెలుపునకు పోరాడవచ్చని క్రికెట్ పండితులు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News