: వాషింగ్టన్ మాల్ లో కాల్పుల దుండగుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
అమెరికాలోని వాషింగ్టన్ లోని ఓ మాల్ లో విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఐదుగురిని హత్య చేసిన ఘటనలో పోలీసులు అనుమానితుడిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు వాషింగ్టన్ స్టేట్ పెట్రోల్ విభాగం పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. బుర్లింగ్ టన్ లోని కాస్కేడ్ మాల్ లో కాల్పులకు దిగిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం అతడిని ప్రశ్నిస్తున్నామని వివరించారు. దాడి అనంతరం అక్కడి సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా, తుపాకీ ధరించిన వ్యక్తి కనిపించాడు. ఆపై మరో పది నిమిషాల తరువాత రోడ్డుపై అతను నడిచి వెళుతున్న ఫుటేజ్ లభించింది వీటి ఆధారంగా అతన్ని అదుపులోకి తీసుకున్నామని, మరిన్ని వివరాలు త్వరలోనే తెలుపుతామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.