: రండి, ఆ పోరాటంలో ఎవరు గెలుస్తారో చూద్దాం!: పాకిస్థాన్ కు మోదీ సవాల్


పాకిస్థాన్ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ యుద్ధ సవాలు విసిరారు. అయితే ఆ యుద్ధం ఆయుధాలతో చేసుకునేది కాదు! కేరళలోని కోజికోడ్ లో ఆయన మాట్లాడుతూ, పాక్ ప్రజలను పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగంపై పోరాటం చేసేందుకు పోటీ పడదామని పిలుపునిచ్చారు. ఈ పోరాటంలో ఎవరు గెలుస్తారో చూద్దామని ఆయన సవాల్ విసిరారు. అభివృద్ధి, వికాసం కోసం పోరాడదామని ఆయన అన్నారు. విద్యనభ్యసించడం, ఉన్నతంగా ఆలోచించడం ద్వారా వెనుకబాటుతనాన్ని తరిమేయడం ద్వారా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని ఆయన పాక్ ప్రజలకు పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News