: హైదరాబాద్‌లో బైక్‌పై వెళుతూ నాలాలో కొట్టుపోయిన యువకుడు
హైదరాబాద్‌లో కురిసిన వర్షాలతో నగర వాసులు నానా అవస్థలు పడుతున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు నిండిపోవడం, వాటి పక్కనే నాలాలు ఉండడంతో ప్రాణాపాయస్థితిలో పడుతున్నారు. నిజాంపేటలో ఇటువంటి విషాదమే చోటుచేసుకుంది. బైక్‌పై వెళుతూ ఓ యువకుడు నాలాలో కొట్టుపోయాడు. యువకుడి కోసం స్థానికులు, జీహెచ్ఎంసీ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. నాలాలో పడిపోయిన యువకుడి గురించి వివరాలు తెలియాల్సి ఉంది.